గద్వాల, వెలుగు: పేదల సొంతింటి కలను నెరవేరుస్తామని ఎమ్మెల్యే బండ్ల కృష్ణ మోహన్ రెడ్డి తెలిపారు. బుధవారం గద్వాల, దరువు ఎంపీడీవో ఆఫీస్ ఆవరణలో ఇందిరమ్మ మోడల్ హౌస్ నిర్మాణానికి భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు గ్యారంటీల్లో భాగంగా ఇందిరమ్మ ఇండ్ల మంజూరు చేస్తుందన్నారు. ప్రతి నియోజకవర్గానికి 3,500 ఇండ్లు మంజూరు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. త్వరలోనే గ్రామ సభల ద్వారా లబ్ధిదారులను ఎంపిక చేస్తామన్నారు.
గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సూచన మేరకు ఇందిరమ్మ మోడల్ హౌస్ లను నిర్మిస్తున్నామని చెప్పారు. ఇందిరమ్మ ఇండ్ల లో ఒక బెడ్ రూమ్, హాల్, కిచెన్ ఉంటుందని తెలిపారు. మార్కెట్ కమిటీ చైర్మన్ హనుమంతు, మాజీ చైర్మన్ శ్రీధర్ గౌడ్, మాజీ జడ్పీటీసీ పద్మ ఉన్నారు. అనంతరం గద్వాల పట్టణంలోని బృందావన్ గార్డెన్ లో ఎంబీ చర్చ్ ఆధ్వర్యంలో జరిగిన క్రైస్తవుల కూడిక కార్యక్రమానికి హాజరయ్యారు.